తనకు కండువా కప్పబోయిన జగన్కు షాకిచ్చిన పి.గన్నవరం ఎమ్మెల్యే
- వైసీపీ కండువాను కప్పుకోని పులపర్తి
- దండం పెట్టి వెనక్కి వచ్చేసిన ఎమ్మెల్యే
- సొంతపార్టీ నేతలపై జగన్ ఆగ్రహం
అనుకున్నట్టే పులపర్తి నారాయణమూర్తి పిఠాపురం సభలో జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ భావించారు. అయితే, పులపర్తి అందుకు తిరస్కరించారు. సభకు వచ్చిన జనాలకు చేతులెత్తి నమస్కరించి వెనుదిరిగారు. దీంతో ఏం జరిగిందో అర్థంకాక సభకొచ్చినవారు, నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. నారాయణ తీరుతో అవాక్కైన జగన్ ఆయనను తన వద్దకు తీసుకొచ్చిన సొంతపార్టీ నేతలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.