బీటెక్ విద్యార్థినిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అక్కడికక్కడే మృతి

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న బీటెక్ విద్యార్థినిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని బోడుప్పల్‌కు చెందిన స్నేహగా పోలీసులు గుర్తించారు. ప్రాజెక్ట్ పనిపై అమీర్‌పేట్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్నేహ బోగారంలోని హోలీ మేరీ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.  
Go Back to Shorts
Sneha
RTC Bus
Hyderabad
Btech Student
Ameerpet

More Telugu News