విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొనడంతో ఆసుపత్రి పాలైన విజయ్ దేవరకొండ
- హోలీని బాగా జరుపుకున్నాను
- బుధవారం ఉదయం వరకూ షూటింగ్‌లోనే ఉన్నా
- నాకు జ్వరం వచ్చింది
- తొందరగా కోలుకునేందుకు చికిత్స తీసుకున్నా
తనకు విరామం లేకపోవడంతో జ్వరం వచ్చిందని.. త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆసుపత్రికి వెళ్లినట్టు విజయ్ వెల్లడించాడు. ‘‘హోలీని చాలా బాగా జరుపుకొన్నాను. బుధవారం తెల్లవారుజామున ఆరు గంటల వరకూ షూటింగ్‌లోనే ఉన్నా. దీంతో నాకు జ్వరం వచ్చింది. కానీ తొందరగా కోలుకోవాలి. అందుకే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా’ అని తెలిపాడు. విజయ్ కమిట్మెంట్‌కి చిత్రబృందం తెగ సంబరపడిపోతోంది.