Andhra Pradesh: పవన్ కల్యాణ్ కు ఝులక్.. జనసేనకు రాజీనామా చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త!

  • ప్రత్తిపాడు సమన్వయకర్తగా ఉన్న నేత
  • టికెట్ ఇచ్చేందుకు నో చెప్పిన పవన్ కల్యాణ్
  •  అనుచరులతో కలిసి టీడీపీలో చేరిన సాయికుమార్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి షాక్ తగలింది. జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త సాయికుమార్ యాదవ్ ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రత్తిపాడు టికెట్ ను పవన్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన సాయికుమార్ వెంటనే జనసేనకు రాజీనామా సమర్పించారు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. టీడీపీలో చేరితే తగిన గౌరవంతో పాటు పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల హామీలపై సంతృప్తి చెందిన సాయికుమార్ ఈరోజు ఉదయం 2,000 మంది అనుచరులు, మద్దతుదారులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ ఏడాది జనవరి 23న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి సాయికుమార్ జనసేనలో చేరారు. కాగా, ప్రత్తిపాడు స్థానానికి అభ్యర్థిని జనసేన ఇంకా ఖరారు చేయలేదు.
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
Telugudesam
saikumar

More Telugu News