Jammu And Kashmir: సహనం కోల్పోయిన జవాను.. ముగ్గురు సహచరుల కాల్చివేత

  • సహచరులతో వాగ్వివాదం.. కాల్పులు 
  • అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యా యత్నం
  • జమ్ముకశ్మీర్‌ ఉద్దంపూర్‌లో ఘటన
ఓ సీఆర్పీఎఫ్‌ జవాను సహచరులపైనే కాల్పులకు దిగాడు. ముగ్గురిపై కాల్పులు జరిపి తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా కాల్పులు జరిపిన జవాను పరిస్థితి విషమంగా ఉంది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలావున్నాయి.

 ఉద్దంపూర్‌లోని 187వ సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌లో అజిత్‌కుమార్‌ అనే జవాను పనిచేస్తున్నాడు. బుధవారం అతను తోటి సహచరులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అజిత్‌కుమార్‌ సహచరులపై కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే వారు కుప్పకూలిపోయి దుర్మరణం పాలయ్యారు. అనంతరం అజిత్‌కుమార్‌ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. సహచరులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Jammu And Kashmir
CRPF
three dead

More Telugu News