Allu Bhanumati: పవన్ కల్యాణ్ మోసం చేశారు: మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆవేదన!

  • టికెట్ ఇస్తానని చెబితే పార్టీలో చేరాం
  • ప్రచారం కూడా చేశామన్న భానుమతి
  • చివరకు ఇంకొకరికి టికెట్ ఇచ్చారని ఆరోపణ
ప్రశాంతంగా ఉంటున్న తమ కుటుంబాన్ని, టికెట్ ఇస్తానని చెప్పి తిరిగి రాజకీయాల్లోకి రప్పించిన పవన్ కల్యాణ్, తమను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె, మాడుగుల నుంచి టికెట్ ఇస్తామని పవన్ చెప్పగా, ఉన్నత చదువులు చదివిన తన మనవడు రఘురాజు భవిష్యత్తు కోసం ఆ పార్టీలో చేరామని, ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని ప్రచారం చేసిన తరువాత, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మేలు కలిగించేలా సన్యాసినాయుడికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నానని చెప్పే పవన్ ఇలా చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. పవన్ చెప్పారని తాము ప్రచారం కూడా చేసుకుంటుంటే, మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా తమను వీధుల్లోకి ఈడ్చి దగా చేసినట్లయిందని భానుమతి విమర్శలు గుప్పించారు.
Allu Bhanumati
Madugula
Jana Sena
Pawan Kalyan

More Telugu News