ఏపీ రైతులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ!
- 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం
- ఆర్బీఐ, కేంద్రం సహకరించకున్నా రుణమాఫీ చేపట్టాం
- జలయజ్ఞం పేరుతో సాగునీటి రంగాన్ని ధ్వంసం చేశారు
కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సహకరించకున్నా ఏపీ ప్రభుత్వం 60 లక్షల మంది రైతులకు రూ.24,000 కోట్ల రుణమాఫి చేసిందని కళా వెంకట్రావు తెలిపారు. అలాగే ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో సాగునీటి రంగాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. ఏపీలో రైతుల సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.