బ్రిటన్ లోని అత్యంత చెత్త జైలులో నీరవ్ మోదీ!
- వాండ్స్ వర్త్ జైలులో నీరవ్
- రోజుకు 22 గంటల పాటు గదిలోంచి బయటకు రానీయరు
- కనీస సౌకర్యాలు కరవు
యూకేలో అతిపెద్ద దైన వాండ్స్ వర్త్ జైలులో అధికారులు అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తుంటారు. రోజుకు 22 గంటల పాటు ఇక్కడి ఖైదీలు అత్యంత ఇరుకు గదిలోనే ఉండాల్సి వస్తుంది. ఎంతో మంది ఖైదీలకు నిత్యమూ గాయాలు అవుతుంటాయి. ప్రతి జైలు అధికారి చేతిలో ఉండే ఐరన్ రాడ్డులు ఖైదీలపై నాట్యమాడుతుంటాయి. ఈ జైలులో ఎంతోమంది కరుడుగట్టిన నేరస్తులు, హంతకులు ఉంటారు. ఇక్కడ ఖైదీలకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అటువంటి జైలు ఇప్పుడు నీరవ్ మోదీ తాత్కాలిక నివాసమైంది.