దొంగ దెబ్బ: నకిలీ కరెన్సీని ముద్రించి ఇండియాకు పంపుతున్న పాకిస్థాన్!
- ఐఎస్ఐ ఆధ్వర్యంలో తతంగం
- కెట్వాలో ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్
- బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి
పాక్ లోని కెట్వాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రిస్తున్న కరెన్సీని తొలుత బంగ్లాదేశ్ కు తరలించి, ఆపై, కోల్ కతా మీదుగా ఇండియాలోకి పంపుతున్నారు. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా కేంద్రంగా ఈ దందా సాగుతోందని కూడా పోలీసులు గుర్తించారు. ఆ రాష్ట్రంలో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కృష్ణాపూర్ కు చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం పెంచుకున్న గౌస్, లక్ష నకిలీ కరెన్సీకి రూ. 40 వేలు ఇస్తూ, డబ్బు తెప్పించి చలామణి చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో బబ్లూను చేర్చి అతని కోసం గాలింపు ప్రారంభించారు.