వైసీపీ నేత బాలనాగిరెడ్డిని అరెస్ట్ చేయవద్దు.. స్టే ఆర్డర్ ఇచ్చిన ఏపీ హైకోర్టు!
- మంత్రాలయంలో టీడీపీ-వైసీపీ శ్రేణుల ఘర్షణ
- టీడీపీ నేత తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ గాయం
- మాదవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన నేత
ఈ సందర్భంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తిక్కారెడ్డి గన్ మెన్ కాల్పులు జరపగా, ఓ బుల్లెట్ తిక్కారెడ్డి కాలులో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత బాలనాగిరెడ్డిపై తిక్కారెడ్డి ఇక్కడి మాదవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తమపై అక్రమంగా కేసు పెట్టారని బాలనాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం బాలనాగిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేయకుండా స్టే ఆర్డర్ ఇచ్చింది.