janasena: రాజంపేట జనసేన అభ్యర్థి కుసుమకుమారికి చేదు అనుభవం

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకర్గ అభ్యర్థి ప్రత్తిపాటి కుసుమకుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత తొలిసారి ఆమె జనసేన కార్యాలయంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల నుంచి ఆమెకు వ్యతిరేకత ఎదురైంది. ఇక్కడికి రావడానికి మీరెవరంటూ ఆమెను ప్రశ్నించారు. కార్యాలయం నుంచి వెళ్లిపోవాలంటూ వెంకటరమణ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నచ్చజెప్పేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా... వారు శాంతించలేదు. అయినప్పటికీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వెళ్లలేదు. దీంతో, కార్యకర్తలు ఆఫీసును బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
Go Back to Shorts
janasena
rajampet
kusumakumari

More Telugu News