కీర్తి సురేశ్ నటించే సినిమాలో రాజేంద్రప్రసాద్, నరేశ్
- కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్
- నాయిక ప్రాధాన్యతగల మరో పాత్ర
- ఆల్రెడీ పట్టాలెక్కిన ప్రాజెక్టు
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేంద్రనాథ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. రాజేంద్రప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నదియా .. కమల్ కామరాజు .. భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా వదిలారు. మరికొంతమంది నటీనటుల పేర్లను త్వరలోనే తెలియజేయనున్నట్టు చెప్పారు.