కారు డ్రైవర్ కోసం .. పనిమనిషి కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన అలియా భట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కారు డ్రైవర్ కోసం .. పనిమనిషి కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన అలియా భట్

  • యూత్ లో అలియా భట్ కి క్రేజ్
  • ఇటీవలే జరిగిన పుట్టినరోజు వేడుక
  • మంచి మనసున్న అలియా భట్
ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా అలియా భట్ హవా కొనసాగుతోంది. కుర్రకారు మనసులను పొలోమంటూ కొల్లగొడుతూ ఆమె దూసుకుపోతోంది. ఈ నెల 15వ తేదీన ఆమె తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

అలియా భట్ కారు డ్రైవర్ గా 'సునీల్' .. ఆమె పనిమనిషిగా 'అమోల్' చాలా కాలంగా పనిచేస్తున్నారు. తన దగ్గర చాలా కాలంగా .. చాలా నమ్మకంగా పనిచేస్తోన్న ఈ ఇద్దరికీ, ఈ పుట్టినరోజు సందర్భంగా చెరో గిఫ్ట్ ఇవ్వాలని అలియాభట్ నిర్ణయించుకుందట. ఇద్దరికీ కూడా చెరో 50 లక్షలు పెట్టి ఇల్లు కొనిపెట్టేసింది. ఆ ఇద్దరి కోసం ఆమె అలా కోటి రూపాయలను ఖర్చు చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మంచి మనసును గురించి అంతా చెప్పుకుంటున్నారు.
alia bhatt

More Telugu News