సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీపై మనసులోని మాటను బయటపెట్టిన పవన్ కల్యాణ్!

  • లక్ష్మీనారాయణ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది
  • ఆయన లోక్ సభ కు పోటీచేస్తారు
  • వామపక్షాలు, బీఎస్పీతో చర్చించి నిర్ణయం
జనసేన పార్టీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరడం చాలా సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాలని తాను భావిస్తున్నట్లు అన్నారు. జేడీ రాయలసీమ నుంచి పోటీచేస్తే బాగుంటుందని తన మనసులోని మాటను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ బయటపెట్టారు.

తమకు వామపక్షాలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు బీఎస్పీ, వామపక్షాల నేతలతో తాను చర్చలు జరపనున్నట్లు ఆయన చెప్పారు.

ఈ చర్చల అనంతరం సాయంత్రం 5 గంటలలోపు జేడీ లక్ష్మీనారాయణకు కేటాయించే టికెట్ పై స్పష్టమైన ప్రకటన చేస్తామని పవన్ అన్నారు. చివరగా జైహింద్ అని తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
cbi jd
lakshmi narayana

More Telugu News