టీడీపీలో నన్ను మానసికంగా వేధించారు: మళ్లీ వైసీపీలో చేరిన బుట్టా రేణుక

టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకుంటూ మోసం చేస్తోందని, ఆ పార్టీ విలువలు లేని పార్టీ అని మళ్లీ వైసీపీలో చేరిన బుట్టా రేణుక ఆరోపించారు. హైదరాబాద్, లోటస్ పాండ్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఆమె ఈరోజు వెళ్లారు. తిరిగి వైసీపీలో చేరిన బుట్టా రేణుక, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మళ్లీ తన సొంతింటికి చేరుకున్నంత ఆనందంగా ఉందని అన్నారు. దూరం నుంచి చూస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయని, ఆ భ్రమలోనే నాడు వైసీపీని వీడి టీడీపీలో చేరి పొరపాటు చేశానని, ఆ పొరపాటుకు శిక్ష అనుభవించానని చెప్పారు. టీడీపీలో తనను మానసికంగా వేధించారని ఆరోపించిన రేణుక, వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.
Go Back to Shorts
Telugudesam
butta renuka
YSRCP
lotus pond
Hyderabad

More Telugu News