నరేంద్ర మోదీ బయోపిక్ విడుదల తేదీ ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నరేంద్ర మోదీ బయోపిక్ విడుదల తేదీ ఖరారు

  • వెండితెరకి నరేంద్రమోదీ జీవితచరిత్ర 
  • ప్రధాన పాత్రధారిగా వివేక్ ఒబెరాయ్ 
  • ఏప్రిల్ 12వ తేదీన భారీస్థాయి రిలీజ్
కొంతకాలంగా బాలీవుడ్లో బయోపిక్ లు సందడి చేస్తున్నాయి. ఈ తరహా సినిమాలు ఎక్కువగా భారీ వసూళ్లను రాబడుతూ ఉండటంతో, వాటి జోరు మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' జీవితచరిత్ర ఆధారంగా 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా నిర్మితమవుతోంది. నరేంద్ర మోదీ తన జీవిత ప్రయాణాన్ని అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభించారు. ఎన్నో అవాంతరాలను .. అడ్డంకులను అధిగమిస్తూ ముందుకుసాగారు.

రాజకీయాల్లోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆదర్శప్రాయమైన ఆయన జీవితచరిత్రను దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరపైకి తీసుకువస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, సురేశ్ ఒబెరాయ్ .. సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 12వ తేదీన తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది.
vivek oberoi

More Telugu News