ఏఓబీ పరిసరాల్లో ఎదురు కాల్పులు...అర్ధరాత్రి విశాఖ మన్యంలో కలకలం
- ఇద్దరు మావోయిస్టుల మృతి
- మరికొందరికి గాయాలు
- రెండు నాటు తుపాకులు స్వాధీనం
పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులకు దిగారు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాను కాలిలోకి బుల్లెట్ వెళ్లింది. మావోయిస్టులకు పెదబయలు ఏరియా కమిటీ సుధీర్ నాయకత్వం వహించినట్లు సమాచారం.