ఇక కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. ‘యోనో క్యాష్’ను తీసుకొచ్చిన ఎస్బీఐ!
- యోనో క్యాష్ పాయింట్ల ఏర్పాటు
- పిన్ నంబరు సెట్ చేసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణ అవకాశం
- దేశవ్యాప్తంగా అందుబాటులోకి 16,500కుపైగా ఏటీఎంలు
యోనో క్యాష్ సదుపాయం ఉన్న ఏటీఎంలను ‘యోనో క్యాష్ పాయింట్’గా వ్యవహరించనున్నారు. వినియోగదారులు ఈ పాయింట్లోకి వెళ్లిన తర్వాత కార్డు రహిత విత్‌డ్రాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. అనంతరం ఖాతాదారుడి మొబైల్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ నంబరును ఎంటర్ చేయడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పని 30 నిమిషాల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.