తాడికొండ స్థానంలో అభ్యర్థి మార్పు కోరుతూ.. టీడీపీ నేతల డిమాండ్
- గుంటూరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు
- అరవిందబాబుకు టికెట్ ఇవ్వొద్దంటూ ఆందోళన
- శ్రావణ్‌కు తాడికొండ స్థానం ఇవ్వాలని డిమాండ్
నరసరావుపేటలో అరవిందబాబుకు టికెట్ ఇవ్వొద్దంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేసీఆర్‌ని పొగిడిన వ్యక్తికి టికెట్ కేటాయించడమేంటని నిలదీశారు. నరసరావుపేట నుంచి టీడీపీ కార్యకర్తలు వాహనాల్లో భారీగా చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. మరోవైపు తాడికొండలో పార్టీ గెలవాలనుకుంటే శ్రావణ్‌కు టికెట్ ఇవ్వాలని, తాడికొండ నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రావణ్ స్థానాన్ని మార్చడంతో అక్కడి నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు.