కుటుంబ సభ్యులతో కలసి కారులో పులివెందులకు బయలుదేరిన జగన్!
- కుటుంబ సభ్యులతో కలిసి జిల్లాకు పయనం
- ఈరోజు తుదిశ్వాస విడిచిన వివేకానందరెడ్డి
- ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్, ఫోరెన్సిక్ బృందాలు
హైదరాబాద్ నుంచి కార్లలో జగన్ తన కుటుంబంతో కలిసి కడపకు చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులందరూ పులివెందులకు చేరుకున్నాక వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలను ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నిర్వహించే అవకాశముందని సన్నిహితవర్గాలు తెలిపాయి.
మరోవైపు వివేకానందరెడ్డి భౌతికకాయానికి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కాగా, ఆయన ఇంటికి చేరుకున్న ఫోరెన్సిక్, క్లూస్ టీమ్ సాక్ష్యాలను సేకరిస్తున్నాయి.