న్యూజిలాండ్‌లో కాల్పులు.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు
- క్రైస్ట్‌చర్చ్ మసీదులో కాల్పులు
- ఆ సమయంలో అక్కడే ఉన్న బంగ్లాదేశ్ జట్టు
- వణికిపోయిన ఆటగాళ్లు.. హోటల్‌కు తరలించిన యాజమాన్యం
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేస్తూ.. కాల్పుల నుంచి జట్టు సభ్యులందరం క్షేమంగా బయటపడినట్టు చెప్పాడు. ఈ ఘటనతో వణికిపోయామని, తమకోసం ప్రార్థనలు చేస్తుండాలని ట్వీట్ చేశాడు. మరో ఆటగాడు ముష్పికర్ రహీం ట్వీట్ చేస్తూ.. తమను అల్లానే రక్షించాడని పేర్కొన్నాడు. తాము చాలా అదృష్టవంతులమని, ఇటువంటి ఘటనను మరోమారు చూడాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. కాగా, కాల్పుల ఘటనలో పలువురు చనిపోయి ఉండొచ్చని స్థానిక మీడియా పేర్కొంది. ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన వారిపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.