ఉగ్రవాదం విషయంలో మోదీనే బెటర్.. మన్మోహన్ది మెతక వైఖరి: కాంగ్రెస్ను దిగ్భ్రాంతికి గురిచేసిన షీలా దీక్షిత్ వ్యాఖ్యలు
- తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్న షీలా
- తాను అలా అనలేదని వివరణ
- ఇదంతా మోదీ పోల్ గిమ్మిక్కేనని చెప్పానన్న మాజీ సీఎం
షీలా వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే కలకలం రేగడంతో వెంటనే ఆమె స్పందించారు. ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ట్వీట్ చేశారు. ఉగ్రవాదం విషయంలో మోదీ చాలా కఠినంగా వ్యవహరిస్తారని అనుకుంటున్నారని, కానీ అదంతా ఎలక్షన్ కోసం గిమ్మిక్కు తప్ప మరేమీ కాదని మాత్రమే తాను ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చానని ట్విట్టర్లో వివరించారు.