రామాయణం స్టాంపుల సేకరణలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కిన తెలుగోడు

  • పోస్టల్ ఉద్యోగి అరుదైన ఘనత
  • ఆసక్తితో అందలం
  • 400 స్టాంపుల సేకరణ
తెలంగాణకు చెందిన వి. ఉపేందర్ ఓ పోస్టల్ ఉద్యోగి. ఆయనకు స్టాంపుల సేకరణ ఓ హాబీ. అయితే ఏ స్టాంపు పడితే ఆ స్టాంపు సేకరించకుండా తనదైన శైలిలో కేవలం రామాయణం ఇతిహాసానికి సంబంధించిన పోస్టల్ స్టాంపులనే సేకరించేవారు. ఆ విధంగా 400 వరకు రామాయణ ముఖచిత్రాలతో ఉన్న స్టాంపులు సేకరించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం ఉపేందర్ తమిళనాడులోని మధురైలో పోస్ట్ మాస్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్-2019లో ఉపేందర్ సేకరించిన స్టాంపులను కూడా ప్రచురించనున్నారు. ఉపేందర్ సేకరించిన స్టాంపుల్లో రాముడు, సీత, హనుమంతుడు, రావణుడి చిత్రాలతో ఉన్న స్టాంపులు ఉన్నాయి. ఉపేందర్ తన స్టాంపుల కలెక్షన్ ను అనేక కార్యక్రమాల్లో కూడా ప్రదర్శించారు.
Go Back to Shorts
Telangana

More Telugu News