ఇంకా 28 రోజులు చొక్కాలు చింపుకోవాలి.. శాపనార్థాలు దాచుకో చంద్రబాబూ!: విజయసాయిరెడ్డి

  • తొమ్మిదేళ్లుగా జగన్ పై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు
  • అయినా చంద్రబాబుకు కసితీరలేదు
  • ఏపీ ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుంది
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత తొమ్మిదేళ్లుగా దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. అయినా చంద్రబాబుకు కసితీరలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. విశ్వసనీయత, నిజాయతీ లేని చంద్రబాబు లాంటి వ్యక్తులు అందరినీ దోషుల్లాగే చూడటం కొత్తేమీ కాదని అభిప్రాయపడ్డారు.

విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఇంకా 28 రోజుల పాటు చొక్కాలు చింపుకోవాలి. కొన్ని శాపనార్థాలు దాచుకో చంద్రబాబూ. తొమ్మిదేళ్లుగా జగన్ గారిపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నావు. అయినా కసి తీరడం లేదు. ఓటమి భయం పట్టుకుంది. విశ్వసనీయత, నిజాయతీ తెలియని నీలాంటి వ్యక్తులు అందరినీ దోషులుగా చూపడం కొత్తేమీ కాదు’ అని విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
Vijay Sai Reddy
Twitter

More Telugu News