ఎన్నికల్లో పోటీ చేయాలి.. రుణమివ్వండి: బ్యాంకుకు సామాజిక కార్యకర్త దరఖాస్తు
- కెనరా బ్యాంకును ఆశ్రయించిన వెంకటనారాయణ
- అన్ని రంగాల వారికీ రుణాలిస్తున్న బ్యాంకులు తనకూ ఇవ్వాలని డిమాండ్
- గత ఎన్నికల్లో డబ్బుల కోసం భిక్షాటన
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని రంగాల వారికీ రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా రుణాలు ఇవ్వాలన్నారు. అంతేకాదు, ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కమిషన్, రాష్ట్రపతి, గవర్నర్లకు గతంలోనే ఈ డిమాండ్‌తో లేఖలు రాసినట్టు వెంకటనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి బరిలోకి దిగిన ఆయన డబ్బుల్లేక భిక్షాటన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.