'బ్రహ్మాస్త్ర' తెలుగు టైటిల్ లోగో బాగుంది: దర్శకుడు రాజమౌళి
- హిందీలో రూపొందుతోన్న 'బ్రహ్మాస్త్ర'
- విభిన్నమైన కథాకథనాలు
- భారీ తారాగణం .. భారీ బడ్జెట్
ఈ సినిమా హిందీ టైటిల్ లోగోను ఇటీవల 'ప్రయాగ'లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు టైటిల్ లోగోను రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 'బ్రహ్మాస్త్ర' టైటిల్ లోగో చాలా బాగుందని చెబుతూ, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. ఈ 'క్రిస్మస్'కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కథాకథనాలపరంగా .. సాంకేతిక పరిజ్ఞానం పరంగా విభిన్నమైన నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాపై, అంచనాలు పెరిగిపోతున్నాయి.