ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్న రమ్యకృష్ణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్న రమ్యకృష్ణ!

  • పోర్న్ స్టార్ పాత్రలో రమ్యకృష్ణ
  • ప్యాషన్ తో చేసిన పాత్ర ఇది 
  • మార్చి 29వ తేదీన విడుదల      
'బాహుబలి'లో 'శివగామి' పాత్రను చేసిన దగ్గర నుంచి రమ్యకృష్ణ పాప్యులారిటీ మరింత పెరిగిపోయింది. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకోసం ఆమెను సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోయింది. అలా ఆమె తమిళంలో 'సూపర్ డీలక్స్' సినిమా చేశారు. విజయ్ సేతుపతి .. సమంత ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ కీలకమైన పాత్రను చేశారు.

నటిగా అపారమైన అనుభవమున్న రమ్యకృష్ణ, ఈ సినిమాలో ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్నారట. ఇప్పుడు ఈ విషయమే కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. 'ఇది నా కెరియర్లోనే ఛాలెంజింగ్ రోల్ .. కొన్ని పాత్రలు పేరు కోసం .. కొన్ని పాత్రలు డబ్బుకోసం .. మరికొన్ని పాత్రలను ప్యాషన్ తో చేస్తాము .. అలా ప్యాషన్ తో చేసిన పాత్ర ఇది' అని రమ్యకృష్ణ చెప్పడం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది. కుమార రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మార్చి 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.
ramyakrishna

More Telugu News