Ghanta Murali: వైసీపీకి ఘంటా మురళి రాజీనామా.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో వలస రాజకీయాలు ఊపందుకున్నాయి. వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనకు మద్దతుగా పశ్చిమ గోదావరికి చెందిన మరికొందరు నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు.

ఒకప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిన మురళి.. రాష్ట్ర విభజనానంతరం వైసీపీలో చేరారు. ఆ పార్టీ ముఖ్య నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన వైసీపీకి రాజీనామా సమర్పించారు. నేడు చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కనున్నారు. మురళీ రాజీనామా వైసీపీకి ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. 
Go Back to Shorts
Ghanta Murali
YSRCP
Telugudesam
Chandrababu
West Godavari District
Andhra Pradesh

More Telugu News