డబ్బు, మోసం, కులగజ్జి, అరాచకాలతో రాజకీయం చేసేది మీరే చంద్రబాబూ!: విజయసాయిరెడ్డి
- వైసీపీకి ప్రజాదరణ ఉంది
- మా పార్టీ డబ్బుపై ఆధారపడదు
- ట్విట్టర్ లో ఏపీ సీఎంకు కౌంటర్
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘డబ్బు, నయవంచన, మోసం, కులగజ్జి, అరాచకాలతో రాజకీయం చేసేది తమరే చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కు రూ.500 కోట్ల విరాళం, గెలిస్తే మరో 500 కోట్లు తిరిగి ఇవ్వాలన్న కండిషన్ పై నిధులు సమకూర్చింది ఎవరో ప్రజలకు తెలుసు. వైఎస్సార్ కాంగ్రెస్ డబ్బుపై ఆధారపడదు. ప్రజాధరణ ఉన్న పార్టీ మాది’ అని తేల్చిచెప్పారు.