లండన్ లో రెచ్చిపోయిన 'ఖలిస్థాన్'.. భారతీయులను వెంటాడి, పిడిగుద్దులు.. వీడియో చూడండి

ప్రత్యేక పంజాబ్ దేశం కోసం డిమాండ్ చేస్తున్న పాక్ ప్రేరేపిత ఖలిస్థాన్ అనుకూలవాదులు లండన్ లో రెచ్చిపోయారు. భారత హైకమిషన్ వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన భారతీయులపై దాడికి తెగబడ్డారు. భయంతో పరుగులు పెట్టిన వారిని కూడా వదలకుండా... వెంటాడి, పట్టుకుని, పిడిగుద్దులు గుప్పించారు.

ఖలిస్తాన్ అనుకూల ఆందోళనకారులు తలపాగాలు ధరించి వచ్చి... భారత వ్యతిరేక నినాదాలు చేశారు. 'అల్లాహో అక్బర్', 'నారా ఏ తక్బీర్' అంటూ నినాదాలు కూడా చేశారు. వీసా సంబంధింత అపాయింట్ మెంట్ల కోసం వేచి చూస్తున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఈ సందర్భంగా వారు ఖలిస్థాన్ జెండాలను కూడా పట్టుకున్నారు.

ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాది నేపథ్యంలో ప్రపంచ దేశాల వ్యతిరేకతను పాకిస్థాన్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ అనుకూలవాదులను రెచ్చగొట్టడం ద్వారా భారత్ పై అక్కసును తీర్చుకోవాలని భారత్ భావిస్తున్నట్టు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Go Back to Shorts
london
khalistan
indian high commission
attack
indians

More Telugu News