గంగూలీతో బంధాన్ని తెంచుకోవడానికి కారణం ఇదే: నగ్మా
- గంగూలీ, నేను ప్రేమించుకున్నాం
- అతని కెరీర్ కోసం బంధాన్ని తెంచుకున్నాం
- సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా
క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలీతో నగ్మాకు రిలేషన్ షిప్ ఉండేదని, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని గతంలో వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, గంగూలీ, తాను ప్రేమించుకున్న సంగతి నిజమేనని చెప్పారు. గంగూలీ కెరీర్ కోసం రిలేషన్ షిప్ కు ముగింపు పలికామని చెప్పారు. ఒకటి కావాలనుకున్నప్పుడు మరొకటి వదులుకోవాలని అన్నారు.