జనాభాను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్న జైన మహాసభ
- తగ్గుతున్న జైనుల జనాభా పెరుగుదల శాతం
- ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కనాలన్న జైన మహాసభ
- మూడో సంతానం విద్యకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ
మూడో సంతానం విద్యకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని జైన మహాసమితి జాతీయ అధ్యక్షుడు అశోక్ బడ్జాతియా ప్రకటించారు. ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులను ప్రోత్సహించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పెళ్లి వయసు వచ్చిన యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకునేలా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. విడాకులు తీసుకున్న వారు మళ్లీ పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.