ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి!
- అసమర్థుడైన ఉమకు పీడకలలు వస్తుంటాయి
- అందుకే ఇడుపులపాయకు రాజధాని పోతుందంటున్నారు
- గ్రాఫిక్స్ భ్రాంతి నుంచి బయటకు రావాలని హితవు
ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఉమ అనే అసమర్థ మంత్రికి ఎప్పుడూ పీడ కలలు వస్తుంటాయి. రాజధాని ఇడుపులపాయకు తరలిపోతుందని కొత్త కల కన్నాడు. మీరు అసలు రాజధాని కడితే గదా ఇంకొకరు మార్చేది. అమరావతిలోని రాజధాని నిర్మిస్తాం. గ్రాఫిక్స్ భ్రాంతిలోనుంచి బయటకు రా ఉమా!’అని ట్వీట్ చేశారు.