సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత.. రాత్రివేళ లైట్లు వేసుకోవద్దంటూ బీఎస్ఎఫ్ ఆదేశాలు
- బీఎస్ఎఫ్ ఆదేశాలతో గ్రామాల్లో అంధకారం
- లైట్లు వెలిగితే పాక్ దాడులకు తెగబడే అవకాశం
- అనుమానాస్పద వ్యక్తుల వివరాలు ఇవ్వాలన్న బీఎస్ఎఫ్
బీఎస్ఎఫ్ ఆదేశాలతో ఆయా గ్రామాలు రాత్రివేళ చిమ్మచీకటిలో గడుపుతున్నాయి. భద్రతా దళాల ఆదేశంతో గ్రామాల్లో విద్యుత్ దీపాలను ఆర్పివేసినట్టు రండోసాన్ గ్రామ సర్పంచ్ దిలీప్ సిన్హా చౌహాన్ తెలిపారు. గ్రామంలో లైట్లు వెలిగి ఉంటే పాక్ దళాలు దాడికి తెగబడే అవకాశం ఉందని సిన్హా పేర్కొన్నారు. అలాగే, సరిహద్దుల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే బీఎస్ఎఫ్కు సమాచారం ఇవ్వాలంటూ గ్రామాల్లోని గోడలపై బీఎస్ఎఫ్ హెల్ప్‌లైన్ నంబరును రాసింది.