Uttar Pradesh: మీ కోసం వేశ్యలను తెప్పించి డ్యాన్సులు చేయించాలా?: నోరు జారిన బీజేపీ నేత

  • తన నియోజకవర్గంలో పర్యటించిన యూపీ ఎమ్మెల్యే
  • అభివృద్ధి ఎక్కడుందని ప్రశ్నించిన యువకుడిపై ఆగ్రహం
  • వేశ్యలను తప్పించి డ్యాన్సులు చేయిస్తే అభివృద్ధా? అని మండిపాటు
తనను ప్రశ్నించిన ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, యూపీలోని ఫరీదాపూర్ బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్‌ బిహారీ లాల్‌ నోరు జారి విమర్శలు కొనితెచ్చుకున్నారు. మీకోసం వేశ్యలను తెచ్చి, వారితో డ్యాన్సులు చేయించాలా? అని ఆయన మండిపడటంతో మహిళా సంఘాలు, విపక్షాలు ఆయన మాటలను తప్పుపడుతున్నాయి.

 ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు తన నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వచ్చిన ఆయనతో, ఓ యువకుడు, తమ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి వుందని, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. దీంతో శ్యామ్ బిహారీ లాల్ కు ఆగ్రహం తన్నకుొచ్చింది.

 "నోటికొచ్చినట్లు మాట్లాడకు. మీ గ్రామం అభివృద్ధి చెందలేదా? కరెంట్ రాలేదా? రోడ్లు రాలేదా? ఇంకేం కావాలి? వేశ్యలను పిలిపించి, మీతో పాటు నృత్యాలు చేయించాలా?" అన్నారు.
Uttar Pradesh
Faredabad
Shyambihari Lal
Prostitutes

More Telugu News