ఆ ఐదు నియోజకవర్గాల్లో ఎవరు?.. గుంటూరు టీడీపీ నేతలతో నేడు చంద్రబాబు భేటీ!
- ఈరోజు ఉదయం 11 గంటలకు నేతలతో సమావేశం
- ఇద్దరు అభ్యర్థులను ఇప్పటికే ఓకే చేసిన సీఎం
- గుంటూరు జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి నుంచి ఆలపాటి రాజాకు మరోసారి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత ఇప్పటికే నిర్ణయించారు. అలాగే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి గల్లా జయదేవ్ ను మళ్లీ రంగంలోకి దించాలని బాబు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు టీడీపీ నేతలతో బాబు విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.