కాంగ్రెస్ కు షాక్... టీఆర్ఎస్ లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు!

  • నేడు టీఆర్ఎస్ లోకి ఆత్రం సక్కు, రేగా కాంతారావు
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్
  • 101కి పెరగనున్న టీఆర్ఎస్ బలం
తెలంగాణలో మరోసారి ఫిరాయింపుల పర్వం మొదలైంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు టీఆర్ఎస్ లో చేరనున్నారు. నేడు వీరిద్దరూ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా అధికారికంగా ప్రకటించారు.

కాగా, రానున్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఐదు స్థానాలనూ తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపగా, దాదాపు 10 మంది వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరవచ్చని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి) సైతం శనివారం కేసీఆర్ ను కలిశారు. ఆయన చేరిక కూడా ఖాయమైపోయినట్టు సమాచారం.

ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్ కు 91 మంది ఎమ్మెల్యేల బలంతో పాటు, మజ్లిస్ కు చెందిన ఏడుగురు మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు కాంగ్రెస్, ఒక టీడీపీ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం టీఆర్ఎస్ బలం 101కి చేరినట్లవుతుంది.
Go Back to Shorts
TRS
Congress
Rega Kantarao
Atram Sakku

More Telugu News