స్టిక్కర్ బాబూ.. అమరావతికి పట్టిన అవినీతి చెదపురుగువి నువ్వు!: కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శ
- నిన్న కూలిన ఏపీ హైకోర్టు శ్లాబు
- చంద్రబాబు లక్ష్యంగా కన్నా విమర్శలు
- ఏపీ సీఎం బుద్ధులతో పాటు నిర్మాణాలూ నాసిరకంగా ఉన్నాయని ఎద్దేవా
ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘స్టిక్కర్ బాబూ.. అమరావతికి పట్టిన "అవినీతి చెద పురుగు"వి నువ్వు.. నీ బుద్ధులే కాదు నీ నిర్మాణాలు కూడా "నాసిరకమే". సెక్రటేరియట్లో వర్షం.. పోలవరంలో పగుళ్లు.. హైకోర్టు శ్లాబ్ కూలడం. "గోడ కట్టడం రాదు గాని గోల్కొండ కోట కట్టా "అని కహానీ చెప్పే నీలాంటివాడిని పిచ్చోడు అనక ఏమనాలి?’ అని ట్వీట్ చేశారు.