సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పెళ్లయ్యాక కూడా నటిస్తుందట
- బన్నీ సినిమా స్క్రిప్టుకి మార్పులు
- నిర్మాతగా మారిన 'యాత్ర' దర్శకుడు
* అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రూపొందే చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, స్క్రిప్టుకు ఇంకా మార్పులు చేర్పులు చేస్తున్నందున ఆలస్యమవుతోందని అంటున్నారు. అలాగే కథానాయికను కూడా ఇంకా ఎంపిక చేయలేదు.
* ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' చిత్రాన్ని రూపొందించి మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నాడు. తన మిత్రులతో కలసి త్రీ ఆటమన్ లీవ్స్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పారు.