దొంగదెబ్బ కొట్టి.. నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన ఉగ్రవాది!

నేటి ఉదయం జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే భద్రతా బలగాలను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందించాయి.

చనిపోయారనుకున్న ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన బలగాలపై ఓ ఉగ్రవాది ఇక్కడే దొంగదెబ్బ కొట్టాడు. చనిపోయినట్టుగా నటించి.. భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లగానే వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఓ జవాను సహా ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

Abhinandan
Pakistan
India
CRPF Inspector

More Telugu News