భారత్, పాకిస్థాన్ ల ఉమ్మడి శత్రువు ఉగ్రవాదమే.. మనం ఇంకా ఎంత రక్తం చిందించాలి?: మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్
- ఇరుదేశాలు ప్రస్తుతం సంయమనం పాటించాలి
- ఉగ్రవాదంపై భారత్, పాక్ కలిసి పోరాటం చేయాలి
- ట్విట్టర్ లో స్పందించిన పాక్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్ లోని జైషే ఉగ్రస్థావరాలపై గత మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో దాదాపు 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో వెంటనే స్పందించిన పాకిస్థాన్ మరుసటి రోజు భారత ఆర్మీ స్థావరాలపై వైమానిక దాడులకు సిద్ధమవగా, భారత్ వాయుసేన అడ్డుకుంది. ఈ సందర్భంగా మిగ్-21 నడుపుతున్న అభినందన్ వర్ధమాన్ అనే భారత పైలట్ పాక్ ఆర్మీకి చిక్కారు.