raghuveerareddy: మోదీ రాక సందర్భంగా నల్ల రిబ్బన్లతో నిరసన: రఘువీరారెడ్డి

  • ఆంధ్రాకు ద్రోహం చేసిన వ్యక్తి ఆయన
  • ప్రత్యేక హోదా భరోసా యాత్ర రద్దు
  • రైల్వే జోన్‌తో కపట ప్రేమ నటిస్తున్నారు
ప్రధాని మోదీ విశాఖ రాక సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నల్లరిబ్బన్లతో తమ నిరసన తెలియజేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈ రోజు నిర్వహించాల్సిన ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించడం కంటి తుడుపు చర్య అన్నారు.

ఆంధ్రాకు పూర్తిగా ద్రోహం చేసిన వ్యక్తి మోదీ అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో తమకు ఎటువంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మన వాయుసేన దాడులు చేసి వారి పీచమణచడాన్ని అభినందిస్తున్నామని, కాకపోతే దేశ భద్రత అంశాలను కూడా తమ రాజకీయ అవసరాలకు బీజేపీ వాడుకుంటుందనేందుకు ఆ పార్టీనేత యడ్యూరప్ప వ్యాఖ్యలు నిదర్శనమని విమర్శించారు.
raghuveerareddy
Narendra Modi
Vizag

More Telugu News