Andhra Pradesh: బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడానికి సిగ్గులేదూ?: దేవినేని ఉమ ఫైర్

  • ఏపీ ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారు
  • మరోమారు మోసం చేసేందుకే ‘రైల్వేజోన్’ పై ప్రకటన
  • ఆదాయం లేని రైల్వేజోన్ ని ఏపీకి ఇచ్చారు
ఏపీ ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారని మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలను ఆయన తుంగలో తొక్కారని నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజలను మరోమారు మోసం చేసేందుకే రైల్వేజోన్ పై ప్రకటన చేశారని విమర్శించారు. రైల్వేజోన్ ప్రకటనపై బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదాయం లేని రైల్వేజోన్ ని ఏపీకి ఇచ్చారని, ఏపీకి అన్యాయం చేసిన మోదీకి తమ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని అన్నారు.
Andhra Pradesh
vizag
modi
pm
devineni

More Telugu News