పాక్ భాగోతం బట్టబయలు.. ఉగ్రవాదులపై దాడి కోసం అమెరికా నుంచి తీసుకున్న మిస్సైల్ భారత్ పై ప్రయోగం!
- ఉగ్రవాదంపై పోరాడతామంటూ పాక్ సన్నాయి నొక్కులు
- అమెరికా నుంచి నిధులు, ఆయుధాల స్వీకరణ
- ఉగ్రవాదులపై వాడాల్సిన మిసైల్ భారత్ పై ప్రయోగం
ఈ నేపథ్యంలో ఎఫ్-16 విమానం నుంచి పాక్ ప్రయోగించిన ఒక మిసైల్ శకలాన్ని మన సైన్యం గుర్తించింది. రాజౌరీ సెక్టార్ లో అమ్రామ్ (అడ్వాన్స్ డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్)కు చెందిన మెటల్ శకలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మిసైల్స్ ను అమెరికా నుంచి పాకిస్థాన్ పొందింది. ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికే ఈ మిసైల్స్ ను ఉపయోగిస్తామనే కండిషన్ పై యూఎస్ నుంచి తీసుకుంది. కానీ, నిబంధనలు తుంగలో తొక్కి ఆ మిసైల్స్ ను భారత్ పై ప్రయోగించింది. దీంతో, పాక్ వక్ర బుద్ధి మరోసారి బట్టబయలైంది.