‘టిక్ టాక్’ యాప్ కు షాక్ ఇచ్చిన అమెరికా.. భారీ జరిమానా విధింపు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘టిక్ టాక్’ యాప్ కు షాక్ ఇచ్చిన అమెరికా.. భారీ జరిమానా విధింపు!

  • రూ.40.6 కోట్ల జరిమానా విధించిన అమెరికా 
  • 13 ఏళ్లలోపు చిన్నారుల వివరాలు బహిర్గతం
  • చట్టానికి విరుద్ధమన్న అగ్రరాజ్యం
చైనా సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’కు యూత్ లో ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉంది. తమ టాలెంట్ ను ప్రదర్శించడానికి చాలామంది దీన్ని ఓ సాధనంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా టిక్ టాక్ యాప్ కు షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఏకంగా రూ.40.6 కోట్ల జరిమానా విధించింది.

అమెరికా మార్కెట్ లోకి అడుగుపెట్టిన టిక్ టాక్ యాప్ మ్యూజికల్‌.ఎల్‌వై (Musical.ly) అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం కొద్దికాలానికే అమెరికాలో అండ్రాయిడ్ మార్కెట్ లో నాలుగో స్థానం, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లో 25వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే 13 ఏళ్లలోపు చిన్నారుల వ్యక్తిగత వివరాలను(పేర్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు) బహిర్గతం చేయడం ద్వారా టిక్ టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది.

ఈ నేపథ్యంలో కంపెనీని దోషిగా తేలుస్తూ ఏకంగా రూ.40.6 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయమై టిక్ టాక్ స్పందిస్తూ.. తాము నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపింది. 13 ఏళ్లలోపు పిల్లలకు పూర్తి యాక్సెస్ కల్పించలేదనీ, యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో 6.5 కోట్ల మంది టిక్ టాక్ యూజర్లు ఉన్నారు.
USA
china
tiktok
fine 40.6 crore

More Telugu News