పాక్‌పై దాడి జరిగిన రోజు నిద్రపోని మోదీ.. ఎద్దేవా చేసిన నటి స్వరభాస్కర్!

  • ప్రధాని నిద్రపోలేదన్న విషయంపై నటి ట్వీట్
  • ఉద్యోగంలో భాగం కాదు కాబట్టి అదనపు పాయింట్లు ఇవ్వాలని ఎద్దేవా
  • స్వరభాస్కర్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు
ప్రధాని నరేంద్రమోదీని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది బాలీవుడ్ ప్రముఖ నటి స్వరభాస్కర్. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం తెల్లవారుజామున దాడులు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రంతా మోదీ నిద్రపోనేలేదు. దాడుల విషయమై ప్రతీక్షణం పర్యవేక్షిస్తూ కంటిమీద కునుకు లేకుండా గడిపారు.

మోదీ జాగారం చేశారాన్న వార్తలపై నటి స్వరభాస్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. మోదీ ఉద్యోగంలో భాగంగా ఇలా జాగారం చేయలేదని, కాబట్టి ఆయనకు అదనపు పాయింట్లు దక్కాలని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది. నటి ట్వీట్‌పై నెటిజన్లు మండిపడ్డారు. మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తారని, మీరు పనిచేస్తారా? అని ప్రశ్నించారు. మీరు చేయలేరని, ఎందుకంటే మీకు చేయడానికి పనే లేదని కౌంటర్ ఇచ్చారు. మీరో అర్బన్ నక్సల్‌లా తయారయ్యారని తీవ్రంగా ఆరోపించారు. మోదీని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ నటి మాత్రం ఆ ట్వీట్‌ను తొలగించలేదు.  
Go Back to Shorts
Bollywood
Actress
Swara Bhaskar
Narendra Modi
Twitter

More Telugu News