ఇండియా చేసింది ఉగ్రవాదంపై యుద్ధమే... మీరు మిలటరీ దాడులకు దిగితే మేము సాయం చేయం!: పాక్ కు అమెరికా ఫోన్

  • పాక్ విదేశాంగ మంత్రికి ఫోన్
  • ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయండి
  • ఉద్రిక్తతలు తొలగించుకునేందుకు చర్చలే మార్గం
ఇండియా తమ యుద్ధ విమానాలతో వచ్చి చేసిన దాడులు కచ్చితంగా ఉగ్రవాదంపై యుద్ధం మాత్రమేనని అమెరికా వ్యాఖ్యానించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైకేల్, ఈ ఉదయం పాక్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు. తక్షణం పాక్ గడ్డపై ఉన్న అన్ని ఉగ్రవాద శిబిరాలనూ నాశనం చేయాలని ఆయన కోరారు. ఇండియాపై మిలటరీ చర్యలకు దిగాలన్న ఆలోచన వద్దని, అదే జరిగితే, తాము కూడా ఏమీ సాయం చేయలేమని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తొలగేందుకు చర్చించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ సమాజం చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఏకాకిగా నిలవవద్దని కోరారు.

Pakistan
USA
Phone Call

More Telugu News