భారత్-పాక్ సరిహద్దు వద్ద సైన్యం ఆంక్షలు.. రాత్రివేళ రాకపోకలపై నిషేధం
- సరిహద్దులో సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఏడు వరకు నిషేధం
- ఏప్రిల్ మొదటి వారం వరకు ఆంక్షలు
- వచ్చే మూడు రోజులు బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పెంచాలని కేంద్రం ఆదేశం
ఏప్రిల్ మొదటి వారం వరకు రాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు రాకపోకలపై నిషేధం విధించినట్టు సైన్యం తెలిపింది. అలాగే, సరిహద్దులో రానున్న మూడు రోజులపాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది.