బ్రహ్మంగారు చెప్పారంటూ.. పవన్ కల్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
- పవన్ గెలిస్తే ఏపీకి సీఎం అవుతాడు
- గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడవుతాడు
- బ్రహ్మంగారు నా చెవిలో ఈ విషయం చెప్పారు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలి కాలంలో ట్విట్టర్ లో చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. పోతులూరి వీరబ్రహ్మంగారు పవన్ గురించి తన చెవిలో ఒక విషయాన్ని చెప్పారని ఆయన అన్నారు. 'రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడవుతాడు. తథాస్తు' అంటూ ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అలవాటు ప్రకారం వాడుకుని వెన్నుపోటు పొడిచారని... దీనికి ప్రతీకారంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబును పవన్ కల్యాణ్ నిజాయతీతో ముందుపోటు పొడుస్తాడని... పవన్ కల్యాణ్ పవర్ మీద తనకు అత్యంత మెగా నమ్మకం ఉందని వర్మ పేర్కొన్నారు.