పాకిస్థాన్‌కు టమాటాల సరఫరా నిలిపివేత.. భారత్‌పై బాంబులేయాలన్న పాక్ జర్నలిస్టు
- పుల్వామా దాడిపై వ్యాపారుల ఆగ్రహం
- టమాటా ఎగుమతులు నిలిపివేత
- విలవిల్లాడిపోతున్న పాక్
భారత వ్యాపారులు టమాటాల నిలిపివేతపై పాక్‌లోని సామాన్య ప్రజలే కాదు.. ఆ దేశ జర్నలిస్టులు కూడా మండిపడుతున్నారు. టమాటాల ఎగుమతిని ఆపేసిన భారత్‌పై అణుబాంబు వేయాలని లాహోర్‌లోని ‘సిటీ 42 టీవీ’ జర్నలిస్టు ఒకరు ఆక్రోశం వ్యక్తం చేశాడు. టమాటాల సరఫరా నిలిపివేసినందుకు ప్రతిగా భారత ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ ముఖాలపై టమాటాలు విసిరికొట్టాలని మండిపడ్డాడు. తప్పైపోయిందని భారత్ వెయ్యిసార్లు అనేలా చేస్తామని హెచ్చరించాడు.
పాక్ జర్నలిస్టు వ్యాఖ్యలపై భారత నెటిజన్లు నవ్వుపుట్టించే కామెంట్లు చేస్తున్నారు. ‘భలే జోక్’ అని కొందరు అంటుండగా, ఒక్క టమాటాలు ఆపేస్తేనే పాక్ విలవిల్లాడిపోతోందని మరికొందరు ఎద్దేవా చేశారు.